BB9: నామినేషన్స్ నుంచి ఇమ్మూ సేఫ్

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 29 రోజులు పూర్తి చేసుకుంది. ఐదవ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగియగా తొలుత కెప్టెన్ రాము రాథోడ్ మినహా అందరినీ నామినేషన్స్‌లో పడేశాడు. అయితే ఇందులో నుంచి ఒకరు మాత్రం తప్పించుకునేందుకు ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు. ఆ టాస్కులో ఇమ్మానుయేల్ గెలిచి నామినేషన్స్‌ నుండి సేఫ్ అయ్యాడు.

ఈ వారం ఇంటి నుంచి బయటికివెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు తనూజ, భరణి, రీతూ, సుమన్, దివ్య, పవన్, శ్రీజ, సంజన, కళ్యాణ్ ఇమ్మానుయేల్, ఫ్లోరా.. ఈ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది మీరు ఇంక వెళ్లొచ్చు.. అంటూ అందరి పేర్లు చదివేసి షాకిచ్చాడు బిగ్‌బాస్.

తర్వాత అందరిని గార్డెన్ ఏరియాకి పిలిచి బిగ్‌బాస్ ఒక అనౌన్స్‌మెంట్ చేశాడు. బిగ్‌బాస్ రణరంగంలో మీ ఊహకి అందకుండా ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని ఈరోజు పొద్దున్న జరిగిన నామినేషన్స్ ద్వారా మీకు బాగా అర్థమై ఉంటుంది.. ఈసారి మీరు చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం.. దానికి యుద్ధభూమి మీ ముందున్న ఓ పెద్ద బెడ్.. ఇందులో గెలవాలంటే నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్‌పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరినీ బెడ్ నుంచి కిందకి దింపాల్సి ఉంటుంది..ప్రతి రౌండ్‌లో స్టార్ట్ బజర్ మోగగానే ఇంటి సభ్యులు బెడ్‌పై ఉండి ఇతర ఇంటి సభ్యుల్ని తమ శక్తిని లేదా ఇతర స్ట్రాటజీని ఉపయోగించి బెడ్ నుంచి కిందకి దింపడానికి ప్రయత్నించాలి.. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరైతే బెడ్‌పై నుంచి కిందకి వస్తారో వారు ఇమ్యూనిటీ పొందే రేసు నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తారు.. ఒకవేళ ఒక రౌండ్‌లో ఒకరి కంటే ఎక్కువ మంది బెడ్‌పై నుంచి కిందకి వస్తే సంచాలకులు వారిలో ఎవరిని ఇమ్యూనిటీ రేసు నుంచి తప్పించాలో నిర్ణయిస్తారు అని చెప్పారు.

Also Read:న్యూజెర్సీలో ఘనంగా దసరా ఉత్సవాలు

ఫస్ట్ రౌండ్ మొదలుకాగానే బెడ్ మీద ఓవైపు భరణి, కళ్యాణ్, డీమాన్, ఇమ్మూ కూర్చున్నారు. లేడీ కంటెస్టెంట్లతో పాటు సుమన్ శెట్టి ఓవైపు కూర్చున్నారు. మాట్లాడుకుందాం మాట్లాడి డిసైడ్ చేద్దాం రౌండ్ రౌండ్‌కి ఎవరిని పంపాలో అని అందరూ అనుకున్నారు. దివ్యని లాగుదామని ట్రై చేశాడు కళ్యాణ్. కానీ ఈ రౌండ్‌లో భరణి, డీమాన్ దూరంగా నిల్చున్నారు. శ్రీజ కూడా వీళ్లకి తోడవ్వడంతో దివ్యని కిందకి తోసేశారు. ఆ తర్వాత బెడ్ మీద శ్రీజ, భరణి, రీతూ, తనూజ, ఇమ్మూ, కళ్యాణ్, డీమాన్ మాత్రమే మిగిలారు. ఇలా ఒక్కొక్కరు ఔట్ కాగా ఇదే చివరి రౌండ్ అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఇలా ప్రతీ గేమ్‌లో చక్కటి ప్రదర్శనతో గెలుస్తూ నామినేషన్స్ నుండి సేవ్ అయ్యారు ఇమ్మూ.

- Advertisement -