ఫాస్టాగ్ లేని వాహనదారులకు గుడ్ న్యూస్

6
- Advertisement -

ఫాస్టాగ్ లేని వాహనదారులకు గుడ్ న్యూస్. జాతీయ రహదారులపై ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపుల విషయంలో రెండు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది కేంద్రం. ఫాస్టాగ్ లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల వద్ద ఇప్పటివరకు సాధారణ రుసుంకు రెండింతలు చెల్లించాల్సి వచ్చే నిబంధనను సడలించారు.

నవంబరు 15 నుంచి అమలులోకి రానున్నాయి ఈ కొత్త నిబంధనలు. హైవే ప్రయాణికులలో FASTag వినియోగం ప్రస్తుతం సుమారు 98 శాతం ఉండగా, దీని వలన టోల్ ప్లాజాల్లో సగటు వేచి ఉండే సమయం 2022 నాటికి 47 సెకన్లకు తగ్గిందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.

దీంతో ఇకపై FASTag లేని వారు UPI ద్వారా టోల్ చెల్లిస్తే తక్కువ పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. వాహన వినియోగదారుడు FASTag లేకుండా లేదా చెల్లుబాటు అయ్యే, సక్రమంగా పనిచేసే FASTag లేకుండా ఉంటే, UPI ద్వారా ఫీజు చెల్లించడానికి ఆప్షన్ ఎంచుకుంటే, ఆయా వాహన వర్గానికి వర్తించే యూజర్ ఫీజు 1.25 రెట్లు చెల్లించవలసి ఉంటుంది” అని రహదారుల మంత్రిత్వశాఖ ఈరోజు జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం, FASTag లేకపోతే లేదా పనిచేయకపోతే, వినియోగదారులు టోల్ ప్లాజాలో రెట్టు టోల్ (2x) చెల్లించవలసి ఉంటుంది. FASTag వ్యవస్థ వినియోగాన్ని పెంచడానికి ఈ నియమాన్ని అమలు చేశారు. దీని వలన టోల్ ప్లాజాల్లో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది.

Also Read:విజయ్ రాజకీయ నాయకుడు కాదు..నటుడే!

- Advertisement -