రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ 2022లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ DJ టిల్లుతో ఘనమైన ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, టిల్లు పాత్ర ఇప్పటికి అందరికి గుర్తుండిపోయింది. తాజాగా విమల్ కృష్ణ మరో విచిత్రమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ కొత్త పాత్రను పూర్తిగా అంచనా వేయలేని శైలిలో పరిచయం చేశారు.
ఈ ప్రాజెక్ట్‌ను చిలక ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఆ బ్యానర్‌లో ఇది నాలుగో చిత్రం కాగా రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ డాండ్ లాంటి అభిరుచి గల నిర్మాతలు ఈ చిత్రానికి సపోర్ట్ చేస్తున్నారు. రఘ్ మయూర్ మరియు మెరిన్ ఫిలిప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
దసరా శుభ సందర్భాన్ని పురస్కరించుకొని, టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనుమానపక్షి అనే ఈ టైటిల్‌నే హీరో పాత్రలోని వినూత్నతను సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రంగురంగుల కామిక్ బుక్ తరహా డిజైన్ ఉంది. శ్రీ చరణ్ పాకాల అందించిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత జీవం పోసింది. ఇది పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకునే, వినోదభరితమైన ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ప్రిన్స్ సిసిల్, అనన్నయా, చరిత్ కీలక పాత్రల్లో నటిస్తారు. సినిమాటోగ్రఫీని సునీల్ కుమార్ నామా, ఆర్ట్ డైరెక్షన్‌ను జె.కె. మూర్తి, ఎడిటింగ్‌ను అభినవ కునపరెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.
Also Read;రూ.150 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్’

