BB9:ఈవారం ఆమె ఎలిమినేషన్ పక్కా!

7
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా నాలుగోవారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. నాలుగోవారం ఇంటినుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజనా, హరిత హరీష్, శ్రీజా దమ్ము, దివ్య నిఖిత ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు.

మూడో వారంలో చూస్తే ప్రియశెట్టితో పాటు.. కళ్యాణ్ పడాల కూడా నామినేషన్‌లో ఉండటంతో బయటకు పోవడానికి ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి ప్రియశెట్టినే ఎలిమినేట్ అయ్యింది. నాలుగోవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని పోల్ నిర్వహించగా.. మెజార్టీ ప్రజలు దమ్ము శ్రీజను ఎలిమినేట్ చేశారు. దీంతో ప్రియశెట్టి బాటలోనే శ్రీజా కూడా ఇంటి ముఖం పట్టడం ఖాయమేనని తెలుస్తోంది. అయితే నాలుగోవారం ఎలిమినేషన్‌ ఉత్కంఠకు మరికొద్దిగంటల్లోనే తెరపడనుంది.

ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్ నుంచి తొలివారంలో శ్రష్టీ వర్మ, రెండోవారంలో మర్యాద మనీష్, మూడో వారంలో ప్రియశెట్టిలు ఎలిమినేట్ అయ్యారు.

Also Read:రూ.150 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్’

- Advertisement -