కమర్షియల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా “జూనియర్” ద్వారా మైనింగ్ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కీర్తి రెడ్డి నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు. నటి శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సౌత్ సినిమా దగ్గర మంచి డెబ్యూ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరీటి రెడ్డి కూడా ఒకడు. మొదటి సినిమా తోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ జూనియర్ ఇప్పుడు ఏకంగా పది వారాల తర్వాత ఓటిటిలో సందడి చేసేందుకు వచ్చేసింది.
మరి ఈ సినిమా హక్కులు ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని అందించగా వారాహి చలన చిత్ర బ్యానర్ వారు తెలుగు, కన్నడ భాషల్లో నిర్మాణం వహించారు.
Also Read:కాంతార చాప్టర్ 1..టికెట్ రేట్ల పెంపు

