దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా సియోల్ లో నారాయణ, జనార్ధన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది.
దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు, ఏపీ ఈడీబీ అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు. ఉదయం కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు మంత్రులు. కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు మంత్రులు.
గ్లోబల్ మార్కెట్ లో కియా కార్ల అమ్మకాలు, కియా యూనిట్ల విస్తరణపై చర్చ జరిపారు. ఏపీలో కియా యూనిట్ కు ప్రభుత్వ సహకారం, ప్లాంట్ విస్తరణ అంశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను వివరించారు మంత్రులు. విశాఖలో నవంబర్ లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించారు మంత్రులు.
Also Read:తెలంగాణ తల్లి ప్లై ఓవర్..

