- Advertisement -
సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి.. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండక పోవచ్చు అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి అని సూచించారు.
స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఈటల సంచలన కామెంట్స్ చేశారు. లీగల్‌గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి… ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి ? చెప్పాలన్నారు.
మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి ?…బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుంది అన్నారు. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసింది.. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు అన్నారు ఈటల.
Also Read:తెలంగాణ తల్లి ప్లై ఓవర్..
- Advertisement -

