మంత్రి లోకేశ్‌కు తిలక్ వర్మ గిఫ్ట్

12
- Advertisement -

ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆసియా కప్‌ ఫైనల్‌లో తాను ఉపయోగించిన క్యాప్‌ను లోకేశ్‌కు ప్రత్యేక బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు తిలక్ వర్మ.

‘నీ బహుమతి ఎంతో ప్రత్యేకమైనది.. స్వదేశానికి వచ్చాక నీ చేతుల మీదుగా క్యాప్‌ తీసుకుంటా’.. అని ట్వీట్ చేశారు మంత్రి లోకేశ్. మరోవైపు తిలక్ వర్మకు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు తిలక్ వర్మ. సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మకు ఘన స్వాగతం లభించింది. తిలక్ వర్మను సత్కరించారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి.

Also Read:సినీ లవర్స్‌కు ట్రంప్‌ షాక్

- Advertisement -