బతుకమ్మ కుంటకు వీహెచ్ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంబర్‌పేట బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో మాట్లాడిన సీఎం.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రతిపాదనపై ప్రణాళిక సిద్ధం చేయండి అన్నారు. బతుకమ్మ కుంట పునరుజ్జీవం కోసం వీహెచ్ ఒంటరి పోరాటం చేశారు అన్నారు.
చెరువులను చెరబడితే తాట తీస్తానని హెచ్చరించారు. చెరువులు, నాలాల కబ్జాలను తొలగించడం, మూసీ పునరుద్ధరణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది అని… ఒకప్పుడు మూసీ నది నీటి ప్రవాహంతో కళకళలాడింది కానీ కాలక్రమేణా ఈరోజు మురికి కూపంగా మారింది అన్నారు. మూసీ అంటేనే మురికి ప్రత్యామ్నాయంగా మారిపోయింది అని… ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది అని తెలిపారు.
ఈ మహానగరంలో ఎంతోమంది మాయగాళ్లు ఉన్నారు..వారి మాయలో పడి ప్రభుత్వ స్థలాలను కొనకండి అన్నారు. నన్ను నమ్మండి.. మీకు మంచి చేస్తా…నగరంలో గంట, రెండు గంటల్లోనే 40 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది…ప్రస్తుతం దీన్ని తట్టుకునే వ్యవస్థ మనకు లేదు…భవిష్యత్తులో ఓ మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. లేకపోతే జీవితంలో కష్టపడి సంపాదించుకున్నవి రాత్రికి రాత్రే నీట మునిగే ప్రమాదం ఉంది అన్నారు.
Also Read:నాగార్జున సాగర్..26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

