9వ సారి ఆసియా కప్ విజేతగా భారత్

6
- Advertisement -

ఆసియా కప్ 2025 విజేతగాటీమిండియా నిలిచింది.సిరీస్‌లో మూడోసారి దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసింది భారత్. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ లో పాక్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి విజేతగా నిలిచింది టీమిండియా. 147 పరుగుల టార్గెట్ ను భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మరో ఎండ్ లో దూబే 22 బంతుల్లో 33 పరుగులు చేయడంతో భారత్ విజయం సునాయసమైంది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో విజృంభించాడు. ఒకే ఓవర్ లో 3 వికెట్లు తీసి పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్‌లో తలపడ్డాయి భారత్ -పాక్‌. ఇక ఆసియా కప్‌ను భారత్ దక్కించుకోవడం ఇది తొమ్మిదోసారి.

Also Read:నాగార్జున సాగర్..26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

- Advertisement -