నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.
‘ది ప్యారడైజ్’ ను గ్లోబల్ సినిమా విజన్ తో చాలా గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తో మేకర్స్ యూనివర్సల్ విజన్ అందరికీ అర్ధమైయింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్, బోల్డ్ ప్రమోషన్స్ అన్నీ గ్లోబల్ మూవీ దిశగానే సాగుతున్నాయి.
తాజాగా ఈ సినిమాలో మోహన్ బాబు లుక్‌ని రివీల్ చేశారు మేకర్స్. ‘ది ప్యారడైజ్’ సర్‌ప్రైజ్ అంటూ మోహన్ బాబు స్టన్నింగ్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. శికంజ మాలిక్ పాత్రలో నటిస్తున్నారు మోహన్ బాబు. 2026 మార్చిలో వరల్డ్‌వైడ్ రిలీజ్‌కి రెడీ అవుతుండగా, ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్ ది ప్యారడైస్ ని ఇండియా నుంచి వచ్చే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా చెబుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాటోగ్రఫీకి సి.హెచ్. సాయి, మ్యూజిక్‌కి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, ఎడిటింగ్‌కి నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్‌కి అవినాష్ కొల్లా పని చేస్తున్నారు. 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుండగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.
Also Read:తీరం దాటిన వాయుగుండం.. తప్పిన ముప్పు

