ఆసియా కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. 203 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక కూడా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది.
సూపర్ ఓవర్ అనివార్యం కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఒక ఓవర్ లో 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులు మాత్రమే చేసింది. కేవలం 3 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. మొదటి బంతికే విజయం సాధించింది. హసరంగ వేసిన తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ మూడు పరుగులు తీశాడు. దీంతో లంకపై భారత్ గెలుపొందింది.
అన్ని మ్యాచ్‌లు గెలిచిన టీమండియా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ కి దూసుకెళ్లింది. ఫైనల్ లో పాకిస్తాన్ తో టీమిండియా తలపడనుంది.
Also Read:TG:డీజీపీగా శివధర్ రెడ్డి

