బీర్ల ఐలయ్యపై మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు

15
- Advertisement -

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన ఆరోపణలు చేశారు. బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు వద్దు…మదర్ డైరీ ఎన్నికల్లో మా జిల్లా నాయకులు కొంతమంది బిఆర్ఎస్ పార్టీ తో పొత్తు పెట్టకుంటున్నారు అని మండిపడ్డారు. రాజకీయ వ్యభిచారం చేయవద్దు.. డిసిసి అధ్యక్షుడు ,మదర్ డైరీ చైర్మన్ మీకు బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ని బొందపెట్టవద్దు అని దుయ్యబట్టారు.

మదర్ డైరీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ గా ఉన్న బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.. రేపు జరగబోయే మదర్ డైరీ ముగ్గురు డైరెక్టర్లు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థలను గెలిపించాలి చైర్మన్లు వేడుకుంటున్నాను అన్నారు.

ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించండి..డిసిసి అధ్యక్షుడు ,మదర్ డైరీ చైర్మన్ జంగిలి పనులు ,లఫంగ పనులు చేయకండి..కాంగ్రెస్ పార్టీ ఓడితే నాయకులు కార్యకర్తలు మీకు బుద్ది చెపుతారు..బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేయి..మదర్ డైరీ ఎన్నికల్లో డైరెక్టర్ గా లక్ష్మి నర్సింహారెడ్డి కి ఓటు వేయకండి అన్నారు.

Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం..హై అలర్ట్

- Advertisement -