తిరుమలలో పీఏసీ-5.. ప్రారంభం

5
- Advertisement -

తిరుమలలో పీఏసీ-5ను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో అత్యాధునిక వసతి సముదాయాన్ని(పీఏసీ-5) ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

వేంకటాద్రి నిలయం వద్ద దీన్ని నిర్మించారు. ముందస్తు బుకింగ్‌ లేకున్నా భక్తులకు వసతి కల్పించేలా రూ.102 కోట్లతో నూతన కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఒకేసారి 4 వేల మందికి ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు.

16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలూ వేడి నీటి సదుపాయం ఇందులో ఉన్నాయి. నూతన వసతిగృహంలో తొలి బుకింగ్‌ టోకెన్‌ను సీఎం చంద్రబాబు భక్తులకు అందించారు.

Also Read:శ్రీవారి సన్నిధిలో రాధాకృష్ణన్

- Advertisement -