నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటా అని ఆయన భార్యతో నాకు ఫోన్ చేయించాడు అని ఈ కేసులో ఏ4గా ఉన్న జెరూసలేం ముత్తయ్య సంచలన కామెంట్ చేశారు. నేను ఓటుకు నోటు కేసులో సరెండర్ అవ్వాలని అనుకున్నాను…రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు.. నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డిని టీడీపీ పార్టీలో నుండి సస్పెండ్ చేస్తారు అని చెప్పాడన్నారు.
అప్పుడు తన రాజకీయ జీవితం సమాప్తం అవుతుందని రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని, ఆయన భార్య గీతా రెడ్డి నాకు ఫోన్ చేసింది అన్నారు. రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో, తన ప్రాణం ఎందుకు తీయాలని నేను సరెండర్ అవ్వలేదు అని ముత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీని కూల్చడానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మకై భారీ కుట్ర చేశారు అన్నారు. అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే, వీరికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది అని చెప్పారు.
Also Read:రచయిత వెంకట్ మృతి..కేసీఆర్ సంతాపం

