జస్టిస్ ఘోష్ నివేదిక పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఐఏఎస్ స్మితా సబర్వాల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కమిషన్ తనకు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసిందని, చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు స్మితా సబర్వాల్.
కమిషన్ నాపై పక్షపాతంతో పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని.. ఈ నివేదికను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొంది స్మితా సబర్వాల్. ఈ పిటిషన్ పై ఒకట్రెండు రోజుల్లో విచారణ చేపట్టనున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ధర్మాసనం.
Also Read:TTD:ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ అప్‌డేట్

