కల్కి 2898 AD సీక్వెల్ నుండి దీపికా పద్దుకొనెను అధికారికంగా తప్పించారని మేకర్స్ ప్రకటించిన తర్వాత ఆమె వార్తల్లో నిలిచింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సినిమా మొత్తం దీపికా పోషించిన సుమతి పాత్ర చుట్టూనే తిరిగినా, ఆ స్థాయి ప్రాజెక్ట్‌కు తగిన నిబద్ధత చూపలేదని వైజయంతీ మూవీస్ ఆమెను తప్పించింది.
కొన్ని మీడియా కథనాల ప్రకారం దీపికా అధిక పారితోషికం మరియు ఇతర సౌకర్యాలు కోరిందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి. దీనిపై దక్షిణాది అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తుండగా, బాలీవుడ్ అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు.
అయితే ఇవేమి పట్టించుకోని దీపికా… బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రాబోయే చిత్రం King షూటింగ్‌ను ప్రారంభించింది.ఇన్‌స్టాగ్రామ్‌లో షారుక్ ఖాన్ చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన దీపికా ఇలా రాసింది. దాదాపు 18 ఏళ్ల క్రితం ఓం శాంతి ఓం చిత్రీకరణ సమయంలో అతను (SRK) నాకు నేర్పిన తొలి పాఠం ఏంటంటే, సినిమా విజయం కన్నా దానిని రూపొందించే అనుభవం, అలాగే దానిని ఎవరి తోడుతో చేస్తావన్నది చాలా ముఖ్యమని. నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, నేను చేసిన ప్రతి నిర్ణయంలోనూ ఆ పాఠాన్ని అన్వయించుకున్నాను. అందుకే మనం మళ్లీ కలిసి 6వ సినిమా చేస్తోన్నామేమో అని తెలిపింది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న King. ఇందులో షారుక్ ఖాన్ వయోవృద్ధ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. రెడ్ చిల్లీస్ మరియు మార్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, జాకీ ష్రాఫ్, అర్షద్ వారసీ, జయదీప్ అహ్లావత్, అభయ్ వర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read:హైదరాబాద్‌లో #Sharwa36

