జగన్‌ను కలవలేదు: కోమటిరెడ్డి

8
- Advertisement -

దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిన్న సమాజిక సేవా కార్యక్రమానికి గుంటూరు వచ్చాను… ఇంత దూరం వచ్చాం అమ్మవారిని దర్శించుకుని వెళ్దాం అని వచ్చాను అన్నారు.

బల ప్రదర్శన నిరూపించడానికి అమ్మవారి దర్శనానికి రాలేదు… తాను పార్టీ మారుతున్నట్లు, జగన్ ని కలిసినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. తాను జగన్ ని కలవలేదు, ఏ పార్టీలో చేరడం లేదు అన్నారు. ఇది సందర్భం కాదు, అన్ని తర్వాత మాట్లాడతాను అన్నారు.

అంతకముందు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన అనుచరులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే. తాను ఎలాంటి బల ప్రదర్శన చేయలేదని, ఎక్కడికెళ్లినా తన అనుచరులు తన వెంటే వస్తారని తెలిపారు. తాను ఎవర్నీ కలవలేదని, వేరే ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు.

Also Read:TTD:శేషాచల స్వామి ఆలయంలో ఉత్సవాలు

- Advertisement -