TTD:బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

12
- Advertisement -

సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ సీవీఎస్వో  మురళీకృష్ణ ఆధ్వర్యంలో టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు, టీటీడీ అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్, శ్రీవారి వాహన సేవలలో వినియోగించే వివిధ వాహనాల పటిష్టత, అనుమానస్పద వ్యక్తులపై నిఘా వంటి అంశాలపై చర్చించారు.

ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల మరియు తిరుపతిలలో పార్కింగ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని… ఎలక్ట్రికల్ కటౌట్లు, ఎల్ఈడీ స్క్రీన్ల పటిష్టత తనిఖీ చేపట్టాలని నిర్ణయించారు.

బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవలకు వినియోగించే వాహనాల స్థిరత్వం మరియు దృఢత్వం పరిశీలన, బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేసే కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్ల గుర్తింపు తనిఖీ చేపట్టాలని, అధిక రద్దీ నేపథ్యంలో ముందస్తుగా అదనపు వాహనాల పార్కింగ్ ఏర్పాటు పై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. టీటీడీ నిఘా, జిల్లా పోలీసు, టిటిడి అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read:Asia Cup:మళ్లీ దాయాదుల పోరు!

- Advertisement -