ప్రభాస్ నటిస్తున్న ద రాజాసాబ్ సినిమాపై అభిమానులు ఆసక్తిగా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారుతి ఈ సినిమాతో ప్రభాస్ సరదా వైపు చూపించబోతున్నారని, ఆయన వినోదభరిత నటనను చూడాలని అభిమానులు ఆతృతగా ఉన్నారు.
ఇప్పటికే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మొదటి సింగిల్ విడుదల కానుందని తెలిసింది. ఇప్పుడు ఆ సాంగ్ గురించి ఆసక్తికరమైన బజ్ ఆన్‌లైన్‌లో వినిపిస్తోంది. ప్రఖ్యాత రాపర్, సింగర్ హనుమాన్‌కైండ్ (సూరజ్ చెరుకట్) ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను పాడినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక అప్‌డేట్ ఇంకా వెలువడలేదు.
ఈ భారీ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ద రాజాసాబ్ జనవరి 9, 2025న పలు భాషల్లో విడుదల కానుంది.
Also Read:Modi:బిహార్‌కు ప్రధాని మోదీ

