200 థియేటర్లు..50 రోజులు!

10
- Advertisement -

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహ. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకొని, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు కొల్లగొట్టిన మహావతార్ నరసింహ మొత్తం 50 రోజులు రన్ ని పూర్తి చేసుకుంది. మహావతార్ నరసింహ చిత్రం ఏకంగా 200 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.

ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించగా తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ అయ్యింది.

Also Read:ఏపీలో బార్ల లైసెన్స్ గడువు పెంపు

- Advertisement -