- Advertisement -
సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఫేక్ ప్రచారం వైరల్గా మారింది. దీంతో తప్పుడు ప్రచారాలపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ అయింది.ఫేక్ ప్రచారంపై కేసు నమోదు చేసింది సీఐడీ.
పురుగుల మందులు, యూరియా వినియోగం తగ్గించాలంటూ సీఎం చంద్రబాబు ఫేక్ వీడియో వైరల్గా మారింది. రైతులకు సీఎం సూచనలపై సామజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారని సైబర్ క్రైమ్ ఐజీ తెలిపారు.
చంద్రబాబు మాట్లాడినట్లు ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించారని స్పష్టం చేశారు పోలీసులు. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read:లోకేష్..అనంతపూర్ టూర్ రద్దు
- Advertisement -

