పవన్ ప్రశంసలకు దేవిశ్రీ ఫిదా!

10
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్. స్క్రీన్ ప్లే కె. దశరథ్ రాశారు, అడిషినల్ రైటింగ్ సి చంద్ర మోహన్.

Also Read:చంద్రమోహన్ దర్శకత్వంలో #నరేష్65

ఇక ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు దేవీ శ్రీ ప్రసాద్. సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ తన ట్యూన్స్ విని ఆశ్చర్యపోయారని చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఓ పండుగలా ఉంటుంది. ఇటీవల ఒక పాట చిత్రీకరించాం. పవన్ కళ్యాణ్ తన డాన్స్ మూవ్స్‌తో అద్భుతంగా చేశారు. ఆయన నా చేతిని పట్టుకుని తనకు నా ట్యూన్ చాలా నచ్చిందని చెప్పారు. చాలా రోజుల తర్వాత డాన్స్ చేయాలన్న తపన తనలో రగిలించిందని అన్నప్పుడు నేను ఆనందంతో మేఘాలపై విహరించినట్టయ్యింది అని చెప్పారు డీఎస్పీ.

- Advertisement -