ఖైరతాబాద్ గణేశుశి శోభాయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాలతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర సాగుతోంది. ఖైరతాబాద్ గణేశుడికి భారీ గజమాల వేసింది ఉత్సవ కమిటీ. మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ ఏడాది 69 అడుగుల ఎత్తున్న బడా గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనగా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ శోభాయాత్ర… ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అంబేడ్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ వరకు సాగుతుంది. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్, పీవీ మార్గ్ మీదుగా హుస్సేన్ సాగర్ సరస్సులో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. భారీ జనసందోహం నేపథ్యంలో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు, జాయింట్ కంట్రోల్ సెంటర్లతో భద్రతా చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ గణేషుడి లడ్డూను మాత్రం నిర్వాహకులు వేలం వేయరు. నిమజ్జనానికి తరలించే ముందే.. భక్తులకు పంపిణీ చేశారు.
Also Read:వినాయక లడ్డూ@ రూ 2.31 కోట్లు

