ఐటీ కారిడార్లో ప్రజారవాణా సేవల విస్తరణ చేపట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఐటీ సంస్థలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సజ్జనార్ తెలిపారు.
ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశంలో వెల్లడించారు సజ్జనార్. నిన్న హైటెక్ సిటీ, హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కార్యాలయంలో TGSRTC, ASSOCHAM, TFMC సంయుక్తంగా నిర్వహించిన చర్చా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు గౌరవంగా అనిపించింది అన్నారు.
ప్రముఖ ఐటీ సంస్థల ఫెసిలిటీస్ మరియు ట్రాన్స్‌పోర్ట్ విభాగాల నేతలతో కలిసి సుస్థిర రవాణా అభివృద్ధి దిశగా చర్చించడం ఒక ప్రత్యేకమైన అవకాశం అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మన ఐటీ కారిడార్‌లో పచ్చదనం వైపు దారితీసే రవాణా విధానాలు, కొత్త ఆవిష్కరణలు, పరస్పర సహకార పరిష్కారాల నిర్మాణంపై దృష్టి పెట్టాము అన్నారు.
Also Read:వరంగల్‌లో కీటెక్స్ ఉత్పత్తి ప్రారంభం..కేటీఆర్ హర్షం

