తెలుగు రాష్ట్రాలకు మరోసారి వానగండం ముప్పు పొంచి ఉంది. 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జనగాం, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు.
సెప్టెంబర్ 2న ఉత్తర ఆంధ్రలో ప్రత్యేకించి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అదే రోజు పశ్చిమ, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు ఉరుములు, వర్షాలు సంభవించే అవకాశం ఉందని.. సెప్టెంబర్ 3న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read:‘మిరాయ్’..ఫాంటసీ ఎంటర్‌టైనర్

