సామాన్యుడి సమస్యలు తీర్చినప్పుడే టెక్నాలజీకి సార్థకత అని కేసీఆర్ మాకెప్పుడూ చెప్తుంటారు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ యువతలో సృజనాత్మకతను వెలికితీసి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది అన్నారు.
టీ హబ్ నుండి సహకారంతో, న్యాయం కోసం పడిగాపులు కాస్తున్న వారికి అండగా నిలిచాడో తెలంగాణ యువకుడు. CLNS అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఒక్క రూపాయికే న్యాయ సలహాలు అందిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తూ నల్లకోటు విలువ పెంచుతున్నాడు కందిక ఆదర్శ్. వారికి అభినందనలు. ఆదర్శ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సామాన్యుడి సమస్యలు తీర్చినప్పుడే టెక్నాలజీకి సార్థకత అని కేసీఆర్ గారు మాకెప్పుడూ చెప్తుంటారు.
తెలంగాణ యువతలో సృజనాత్మకతను వెలికితీసి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది.… pic.twitter.com/jjVLeKngsu
— KTR (@KTRBRS) September 2, 2025
Also Read:‘పెద్ది’.. ఫస్ట్ సింగిల్!

