కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈరోజు, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మండల మరియు జిల్లా కేంద్రాల్లో నేడు, రేపు వివిధ రూపాల్లో నిరసన తెలపనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.
పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన కుట్ర చేస్తున్నది… తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ-కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలి అన్నారు.
ఇది కేసీఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు.. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నది… సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే అన్నారు. నిన్నటిదాకా సీబీఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు?…. దీని వెనుక ఉన్న శక్తులు వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలి…. ఇది కచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకం, వాళ్ళు చేస్తున్న కుట్రనే అన్నారు.
Also Read:సంక్షోభాలే..అవకాశాలుగా!
కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఇచ్చినా ఏ ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదు …కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటాం …బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదు …తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైన త్యాగాలైనా చేస్తాం అన్నారు.

