హీరో విశాల్‌కు ఇది మరచిపోలేని పుట్టినరోజు. అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తుంటే, ‘పందెం కోడి’ స్టార్ అందరికీ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు – తన నిశ్చితార్థాన్ని నటి సాయి ధన్సికతో ప్రకటించాడు.
సెలబ్రేషన్ కూడా చాలా సింపుల్‌గా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఎలాంటి ఫిల్మీ హంగామా లేకుండా, ఆనందం, ఆశీస్సులు, నవ్వులతో ఈ జంట సంతోషంగా కనిపించింది.
తరువాత విశాల్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పంచుకుంటూ ఒక ఎమోషనల్ నోట్ రాశాడు. నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచం నలుమూలల నుండి ఉన్న నా ప్రియమైన వారందరికీ థ్యాంక్స్. మా కుటుంబాల సమక్షంలో నేను, సాయి ధన్సిక ఈ రోజు నిశ్చితార్థం చేసుకున్నాం అని హ్యాపీగా చెప్పుకుంటున్నాను. చాలా పాజిటివ్‌గా, బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నాను అని చెప్పారు.
Also Read:జాతీయ క్రీడా దినోత్సవం..

