తెలంగాణకు కేంద్రం మొండిచేయి

3
- Advertisement -

తెలంగాణకు కేంద్రం నుండి మరోసారి మొండి చేయి చూపింది. ఆంధ్రాకు 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను పంపేందుకు కేంద్రం ఆమోదం తెలిపి తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది. ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు దక్కిన ప్రయోజనం శూన్యం.

తెలంగాణలో యూరియా కోసం పాట్లు పడుతున్న రైతాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో నిలబడ్డ యూరియా దొరకని పరిస్థితి నెలకొంది.

మరోవైపు ఏపీకి మాత్రం వారం రోజులు ముందుగానే యూరియా దిగుమతికి అంగీకారం తెలిపింది కేంద్రం. విశాఖ గంగవరం పోర్ట్‌లో దిగుమతికి కేంద్రం అంగీకారం తెలిపిందని… వచ్చే నెల మొదటి వారంలో కాకినాడ పోర్ట్‌కు మరో 30 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా దిగుమతి కానుందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Also Read:సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం పొడగింపు

- Advertisement -