29న జాబ్ మేళా..ఎక్కడో తెలుసా?

4
- Advertisement -

ఆగస్టు 29న జాబ్ మేళాను నిర్వహించనుంది ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. అందుబాటులో ఉన్న 300 కి పైగా ఉద్యోగాలు ఇవ్వనున్నారు. నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ భాగస్వామ్యంతో ఏపీసీఆర్‌డీఏ ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తోంది.

అందుబాటులో ఉన్న ప్రఖ్యాత కంపెనీలలో 300 కి పైగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పుడు http://naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చు.

వేదిక: స్కిల్ హబ్, CRDA కార్యాలయం, తుళ్లూరు – ఆగస్టు 29న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. పాల్గొనేవారికి అర్హతలను బట్టి నెలకు ₹12,000 నుండి ₹40,000 వరకు జీతాలు ఉంటాయి (SSC నుండి PG వరకు). అమరావతి ప్రాంతంలోని యువతకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను పొందేందుకు ఒక సువర్ణావకాశం అని నిపుణులు చేశారు.

Also Read:గద్వాల్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌..

- Advertisement -