విధులకు ఆలస్యం..తుమ్మల ఆగ్రహం

10
- Advertisement -

విధులకు ఆలస్యంగా హాజరైన ఉద్యోగులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరిధిలోని శాఖలు మరియు కార్పోరేషన్ల ఉద్యోగుల హాజరుపై తుమ్మల సమీక్ష నిర్వహించారు.

ఉదయం 10:40 గంటల వరకు కూడా విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా ఉదయం 10:30 లోపే రిపోర్ట్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

హాజరుకాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలలన్నారు తుమ్మల.

Also Read:వినాయ‌క చ‌వితికి డిప్యూటీ సీఎం దూరం

- Advertisement -