పేదల పక్షపాతి.. సురవరం

11
- Advertisement -

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం బాధాకరం అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. సౌమ్యుడు, మృధుస్వభావి, అందరితో కలిసి మెలిసి ఉంటూ నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం పనిచేసిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు.

నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడిన నాయకుడు సురవరం… తెలంగాణకు చెందిన సురవరం సుధాకర్ రెడ్డి సామాన్య కార్యకర్త స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి గుర్తింపు పొందడం గొప్ప విషయం అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి … సురవరం ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అన్నారు.

కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. సమకాలీన రాజకీయ నాయకుడిగా ఆయనతో కలిసి పని చేసిన రోజులు గుర్తుకువస్తున్నాయంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏ పదవిలో ఉన్నా విలువలతో రాజీపడకుండా పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళి… వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని తెలిపారు చంద్రబాబు.

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. ఒక మంచి వామపక్ష భావజాలం కలిగిన నాయకుడిని తెలంగాణ కోల్పోయింది… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థించారు.

Also Read:సురవరం మృతి..ప్రముఖుల సంతాపం

- Advertisement -