వాతావరణంలో మార్పుల కారణంగా స్పెయిన్‌లో దేశవ్యాప్తంగా మంటలు చెలరేగాయి. ఇప్పటికే తుర్కీయే, పోర్చుగల్ మంటల బారిన పడగా.. స్పెయిన్‌లో కొనసాగుతోంది కార్చిచ్చు.
దేశవ్యాప్తంగా 14 చోట్ల కార్చిచ్చు.. మరో 20 ప్రాంతాలకు మంటలు విస్తరించాయి. మంటల కారణంగా ఇప్పటికే 3 లక్షల 90 వేల ఎకరాలు దగ్ధమైనట్లు సమాచారం. గత రెండు దశాబ్దాలలో ఇదే అత్యంత దారుణమైన వేసవిగా నమోదైనట్లు పేర్కొంది అత్యవసర చీఫ్ వర్జీనియా బార్కోన్స్.
2006 నుండి రికార్డులు ప్రారంభమైన తర్వాత దేశంలోనే అత్యంత దారుణమైన అగ్నిప్రమాద సీజన్‌గా నిలిచింది. గతంలో 2022లో 3,06,000 హెక్టార్లు మంటల్లో కాలిపోవడం పెద్ద రికార్డు కాగా, ఈసారి ఆ సంఖ్యను మించిపోయింది. అధికారులు వేలాది గ్రామస్తులను డజన్ల కొద్దీ గ్రామాల నుండి తరలించారు.
అలాగే, పలు ప్రధాన రహదారులను మూసివేయగా, మాడ్రిడ్–గలీసియా మధ్య రైలు సర్వీసులు నిలిపివేయబడ్డాయి. ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ మంగళవారం జమోరా మరియు కాసెరస్లో అగ్నిప్రమాదాల ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారని సమాచారం.
Also Read:KTR:చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి

