సెప్టెంబర్ 9 నుండి ఆసియా కప్ సమరం ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. సూర్యకుమార్ నేతృత్వంలో టీమిండియా తలపడనుండగా గ్రూప్ -ఏ నుంచి భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి.
ఇక అంతా ఎదురుచూస్తున్న దాయాదుల పోరు సెప్టెంబర్ 14న జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందిగ్దం మాత్రం వీడలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ దేశంతో క్రీడల్లోనూ ఎలాంటి బంధం కొనసాగించవద్దని డిమాండ్ చేపథ్యంలో ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లోనూ ఇండియా చాంపియన్స్ జట్టు పాకిస్థాన్ జట్టుతో ఆడేందుకు విముఖత చూపింది.
ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ అజిత్ అగర్కార్ కీలక కామెంట్స్ చేశారు. మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నను దాటేస్తూ జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలు మాత్రమే అడగండి అంటూ మీడియాకు సూచించారు. దీంతో మరోసారి భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:KTR:చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి
ఆసియా కప్ షెడ్యూల్ ఇదే..
సెప్టెంబర్ 9న – అఫ్గానిస్థాన్ వర్సెస్ హాంకాంగ్
సెప్టెంబర్ 10న – భారత్ వర్సెస్ యూఏఈ
సెప్టెంబర్ 11న – బంగ్లాదేశ్ వర్సెస్ హాంకాంగ్
సెప్టెంబర్ 12న – పాకిస్థాన్ వర్సెస్ ఒమన్
సెప్టెంబర్ 13న – బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక
సెప్టెంబర్ 14న భారత్ వర్సెస్ పాకిస్థాన్
సెప్టెంబర్ 15న – శ్రీలంక వర్సెస్ హాంకాంగ్
సెప్టెంబర్ 16న – బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గానిస్థాన్
సెప్టెంబర్ 17న – పాకిస్థాన్ వర్సెస్ యూఏఈ
సెప్టెంబర్ 18న – శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్థాన్
సెప్టెంబర్ 19న – భారత్ వర్సెస్ ఒమన్
సూపర్ 4 మ్యాచ్‌లు..
సెప్టెంబర్ 20న – గ్రూప్ బి క్వాలిఫయర్ 1 వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 21న – గ్రూప్ ఏ క్వాలిఫయర్ 1 వర్సెస్ గ్రూప్ ఏ క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 23న – గ్రూప్ ఏ క్వాలిఫయర్ 1 వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 24న – గ్రూప్ బి క్వాలిఫయర్ 1 వర్సెస్ గ్రూప్ ఏ క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 25 న గ్రూప్ ఏ క్వాలిఫయర్ 2 వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 26న – గ్రూప్ ఏ క్వాలిఫయర్ 1 వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫయర్ 1
ఫైనల్..
సెప్టెంబర్ 28న – ఫైనల్ మ్యాచ్

