- Advertisement -
ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవాలయం జలదిగ్బందమైంది. ఆలయాన్ని మంజీరా నది చుట్టుముట్టింది. వరద ప్రభావంతో ఐదో రోజు కూడా ఏడుపాయల ఆలయం మూసివేశారు.
రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు జరుగుతుండగా ఎగువన సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద మరింత పెరిగింది మంజీరా నది ఉధృతి.గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి మంజీరా జలాలు.
Also Read:హలగలి..గ్రేట్ హిస్టారికల్ మూవీ
మరోవైపు నారాయణఖేడ్ నియోజకవర్గం వాసర్ వాగు వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానికులు, పోలీసులు హెచ్చరించినా వాగు దాటేందుకు ప్రయత్నించారు ఓ కారు డ్రైవర్. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోగా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు కారు డ్రైవర్.
- Advertisement -

