- Advertisement -
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ACA) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఏసీఏ కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్, మరో 34 మందితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు అయింది.
కేశినేని చిన్ని అసలు పేరు కేశినేని శివనాథ్. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయవాడ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి కేశినేని నానిపై 2,82,085 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.
2024 డిసెంబర్ 14న మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు.
Also Read:హుందాతనానికి నిర్వచనం..వాజ్‌పేయి
- Advertisement -

