Asia Cup 2025:కెప్టెన్‌గా సూర్య!

9
- Advertisement -

సెప్టెంబర్ 9 నుండి ఆసియా కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నట్లు సమాచారం. సూర్య కెప్టెన్సీ రికార్డు కూడా బాగుండ‌డంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు అత‌డినే కెప్టెన్‌గా కొన‌సాగించాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

ఆగ‌స్టు 19న జట్టును ఎంపిక చేయనుండగా ఈ మీటింగ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా పాల్గొన‌నున్నాడు. ఇటీవ‌లే ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు సూర్య. అయితే జట్టు కూర్పు బీసీసీఐకి కష్టతరంగా మారింది.

ఎందుకంటే సంజూ శాంస‌న్‌, అభిషేక్ శ‌ర్మ రూపంలో ఓపెనింగ్ జోడి ఇప్ప‌టికే సెట్ అయింది. దీంతో గిల్‌కు దారులు మూసుకుపోయాన‌ని అంటున్నారు. ఇక ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించిన య‌శ‌స్వి జైస్వాల్‌తో పాటు టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌కు కూడా ఆసియా క‌ప్‌లో చోటు ద‌క్క‌డం క‌ష్ట‌మే. వీరిద్ద‌రిని టీ20ల‌ కంటే ఎక్కువ‌గా టెస్టుల‌పై దృష్టిసారించ‌మ‌ని సెల‌క్ట‌ర్లు తెలిపిన‌ట్లు బోర్డు వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Also Read:హుందాతనానికి నిర్వచనం..వాజ్‌పేయి

సూర్య‌కుమార్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కు 83 మ్యాచ్‌లు ఆడాడు. 38.2 స‌గ‌టుతో 2598 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచ‌రీలు, 21 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

- Advertisement -