వెంకీ-త్రివిక్రమ్..మొదలైంది!

11
- Advertisement -

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు హీరో వెంకటేశ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను ప్రకటిస్తూ ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రాధాకృష్ణ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుందని సమాచారం.

వెంకటేశ్‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌ అనగానే.. నువ్వు నాకు నచ్చావ్‌, మళ్లీశ్వరి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి సినిమాలకి డైలాగ్స్‌తో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించారు త్రివిక్రమ్‌. అలాగే కరణాకరణ్ డైరెక్షన్‌ లో వచ్చిన వెంకటేశ్‌ వాసు సినిమాకి మాటలు రాసింది కూడా త్రివిక్రమే. 2026 లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Also Read:కేసీఆర్ ప్రజాయోధుడు..పుస్తకావిష్కరణ

 

- Advertisement -