యూరియా కోసం రైతుల తిప్పలు

7
- Advertisement -

యూరియా కోసం బారులు తీరిన రైతులతో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద యూరియా కోసం బారులు తీరారు రైతులు.

ఓ కార్యకర్త ఇంటికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా, రైతులను చూసి ఆగారు హరీష్ రావు. గత నెల రోజులుగా యూరియా కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని, ఒక ఆధార్ కార్డుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని హరీష్ రావుతో వాపోయారు రైతులు.

ఈ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అధైర్య పడవద్దని, రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి, యూరియా బ్యాగుల సరఫరా పెంచాలని చెప్పారు హరీష్ రావు.

Also Read:KTR:కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవండి

- Advertisement -