పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. రీపోలింగ్ ను బహిష్కరించింది వైసీపీ. రెండు పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న రీపోలింగ్‌ను బహిష్కరించింది వైసీపీ.
15 పోలింగ్ బూత్‌లలో కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేసింది. 15 పోలింగ్ బూత్‌లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. రీపోలింగ్ పేరుతో డ్రామా సృష్టిస్తున్నారన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు.
మరోవైపు పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది అన్నారు మంత్రి నారా లోకేష్. 30ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు అన్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు… వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం.. భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు అన్నారు.
Also Read:ఇండిగోకు DGCA షోకాజ్ నోటీసులు

