నాలుగు రోజులు..భారీ వర్షాలు!

15
- Advertisement -

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

ఇవాళ పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్​తో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ వానలు పడతాయని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

వరంగల్​ నగరంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. బట్టల బజార్​, పాత బీటు బజార్​లో రోడ్డుపై వరద నీరు నిలిచింది. హంటర్​ రోడ్డు, ఎన్టీఆర్ నగర్​, రామన్న పేట, శివనగర్​, కరీమాబాద్​, సాకరాశి కుంటలో కాలనీలు జలమయమయ్యాయి. ఉర్సుగుట్ట సమీపంలో డీకే నగర్​లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. హబూబాబాద్‌ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో పలు వాగులు పొంగిపోర్లుతున్నాయి. పెద్దముప్పారం-దంతాలపల్లి వంతెన పైనుంచి పాలేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Also Read:కోడిగుడ్ల కుంభకోణం..కాంగ్రెస్‌పై RSP ఫైర్

- Advertisement -