సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించారు.
కూలీ ఈ గురువారం విడుదల కానున్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ సినిమా. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఉత్తర అమెరికాలో మాత్రమే ప్రీమియర్స్ ప్రీ-సేల్స్‌లో ఇది ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటింది.
రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే, ఈ జోరు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వార్ 2 వంటి పోటీ ఉన్నప్పటికీ ఇంతటి మైలురాయిని అందుకోవడం, సూపర్‌స్టార్ రజిని మరియు ఆయన స్టార్ పవర్‌కే నిదర్శనం. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.
Also Read:‘కన్యా కుమారి’ ..రిలీజ్ డేట్

