తమది మగధీర లవ్‌స్టోరీ కాదని చెప్పుకొచ్చారు ఉపాసన. ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనను నిజంగా ప్రేమిస్తే హైదరాబాద్ లోని ఛార్మినార్ దగ్గర ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గరకు కి తీసుకెళ్లాలని చరణ్‌కు పరీక్ష పెట్టానని తెలిపారు. దీంతో నిజంగానే తీసుకెళ్లాడు. అప్పుడు అందరు చరణ్‌ని గుర్తు పట్టి ఆయన మీద పడిపోయారు. ఇది నిజమైన లవ్ టెస్ట్ అని తెలిపింది.
పెళ్లి తర్వాత మెగా కుటుంబం సంప్రదాయాలపై తనకు ఎలా అవగాహన పెరిగిందో వివరించారు.సాధారణంగా చాలా మందికి పెరుగు చివర్లో తినే అలవాటు ఉంటుంది. కానీ నేను పెళ్లి తర్వాత తొలిసారి లంచ్‌కి అందరితో కలిసి కూర్చుని తినేటప్పుడు, మొదట పెరుగు వేసుకుని తినడం మొదలుపెట్టాను. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా తనని చూశారన్నారు.
Also Read:Bigg Boss 9:హౌస్‌లోకి సుమంత్ అశ్విన్!
మా మామయ్య (మెగాస్టార్ చిరంజీవి) పెరుగు చివర్లో తినాలి ఆరోగ్యపరంగా కూడా అది మంచిదని చెప్పారు. అప్పటి నుంచి నేను కూడా అదే పాటిస్తున్నాను అని తెలిపారు ఉపాసన.

