Bigg Boss 9:హౌస్‌లోకి సుమంత్ అశ్విన్!

12
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ హౌస్‌లోకి ఎవరు ప్రవేశిస్తారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సారి హౌస్‌లోకి వెళ్లనున్నారు నటుడు సుమంత్ అశ్విన్.

‘టునీగా టునీగా’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘ప్రేమకథా చిత్రమ్’ వంటి చిత్రాల్లో నటించిన సుమంత్ అశ్విన్, ‘బిగ్ బాస్ 9’ తెలుగు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

మేకర్స్‌ నుండి అధికారిక ధృవీకరణ రాకపోయినా, ఈ వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ షో అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 9’ తెలుగు, 2025 సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది.

Also Read:హంద్రీనీవా..కృష్ణమ్మ పరవళ్లు

- Advertisement -