బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి:కేటీఆర్

6
- Advertisement -

ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన తన అడ్డగోలు, చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు లీగల్ నోటీసు పంపనున్నట్లు తెలిపారు కేటీఆర్.

బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి …లేకుంటే బండి సంజయ్ ను కోర్టుకు లాగుతామని కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ బండి సంజయ్ చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉందని నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు..కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్‌కి నిఘా వ్యవస్థ ఎలా పని చేస్తుందో అనే అంశంలో కనీస అవగాహన లేదు అన్నారు.

నిఘా వ్యవస్థల నిర్వాహన పైన కనీస పరిజ్ఞానం కూడా లేదు…ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అబద్దాలు, అనుచిత వ్యాఖ్యలు, ప్రకటనలు అన్ని హద్దులు దాటాయి..ఇంత దిగజారుడు ఆరోపణలు, చిల్లర మాటలు, బజారు మాటలు మాట్లాడడం బండి సంజయ్ కి అలవాటుగా మారింది అన్నారు. ఆయన ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మాట్లాడిన ప్రతిసారి మరింత దిగజారి మాట్లాడుతున్నాడు…బాధ్యత కలిగిన కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసుల చెప్పులు మూసినంత ఈజీ కాదని బండి సంజయ్ కి ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది అన్నారు. కేవలం తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతోనే, కేవలం వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు వీధి నాటకాలకు తెరలేపిండు అన్నారు.

Also Read:నాగశౌర్య…’బ్యాడ్ బాయ్ కార్తీక్’

- Advertisement -