- Advertisement -
దసరా తరువాత, నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం ది ప్యారడైస్. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేయగా తాజాగా నాని ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇందులో నాని లుక్ అదిరిపోయింది. గడ్డం, పొడవైన మీసాలు, ఆశ్చర్యకరంగా రెండు జడలతో నాని కనిపిస్తున్నారు. అలాంటి లుక్‌ను ట్రై చేయడానికి చాలా ధైర్యం కావాలి, దాన్ని నాని చక్కగా చేసి చూపించారు.
ఈ సినిమాలో నాని.. ‘జడల్’ పాత్రలో కనిపించనున్నారు. వేశ్య కుమారుడిగా ఆయన నటిస్తుండగా మోహన్ బాబు, రాఘవ్ జూయాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:TTD:9న గరుడ సేవ ట్రయల్ రన్
- Advertisement -

