- Advertisement -
హైదరాబాద్ జంట జలాశయాలకు జలకళ సంతరించుకుంది. కురుస్తున్న భారీ వర్షాలకు నిండుకుండలా మారాయి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1783.10 ఫీట్లుగా ఉంది.
హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1763.10 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 4 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 695 క్యూసెక్కులుగా ఉంది.
హైదరాబాద్ లో 5 ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది. శేరిలింగంపల్లిలో 13.38 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా గచ్చిబౌలిలో 13.38 సె.మీ,సరూర్ నగర్ లో 12 సెంటీమీటర్లు,శ్రీనగర్ కాలనీలో 12సెంటీమీటర్లు,ఖైరతాబాద్ సెస్ ప్రాంతంలో 11.88 సె.మీ,యూసఫ్ గూడలో 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు అయింది.
Also Read:తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షం
- Advertisement -

