BRS కరీంనగర్ బీసీ సభ వాయిదా

7
- Advertisement -

రేపటి కరీంనగర్ బీఆర్ఎస్ బీసీ సభ వాయిదా పడింది. వర్షాల కారణంగా ఈ నెల 14కు సభను వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అదే రోజు మిగతా సభల తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.

పార్టీ నేతలతో జరిగిన కీలక సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సభ ప్రాధాన్యత నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఈ సభ దోహద పడనున్న నేపథ్యంలో సభకు ఎలాంటి ఆటంకం జరగకుండా 14వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.

Also Read:‘సు ఫ్రం సో’..బిగ్ బ్లాక్‌బస్టర్

- Advertisement -