సీఎం రేవంత్ భాష మార్చుకోవాలి:కోమటిరెడ్డి

8
- Advertisement -

సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలి అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతిపక్షాలను పదే పదే తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలి అని సూచించారు.

20 మంది సీమాంధ్రా కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు అన్నారు. ఇంకా మూడున్నరేళ్లు రేవంతే సీఎంగా ఉంటాడు కానీ ఆయనకు అంత ఆవేశం పనికిరాదు అన్నారు.

కొద్దిరోజులుగా సీఎం రేవంత్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు కోమటిరెడ్డి. మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజల ఆలోచన…రాజకీయాల్లోకి వచ్చే పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదు… నా స్వార్థం కోసం మంత్రి పదవి అడగట్లేదు నాలాంటి వాడికి మంత్రి పదవి వస్తే ఇంకా ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు అన్నారు.

Also Read:బీసీలను మోసం చేస్తున్న బీజేపీ: కవిత

- Advertisement -